మాడుగుల మండలంలో చురుకుగా పెన్షన్ 12 గంటలకు 83% పూర్తి

మాడుగుల మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకే 83% పంపిణీ పూర్తయినట్లు ఎండిఓకే అప్పారావు తెలిపారు. పోతనపూడి గ్రామంలో పెన్షన్ పంపిణీ చేస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మండలంలోని 29 పంచాయతీల్లో 160 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. మొత్తం 11489 పెన్షన్ల కింద 5.13 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. సాయంత్రానికి 93% పైగా పంపిణీ పూర్తవుతుందని అంచనా.

సంబంధిత పోస్ట్