దేవరపల్లి;తారువాలో పశు ఆరోగ్య శిబిరం

దేవరాపల్లి మండలం తారువ గ్రామంలో శనివారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పశు వైద్యాధికారి డాక్టర్ జి. ప్రియాంక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆవులు, గేదెలు, దూడలకు నులిపురుగుల నివారణ చికిత్సలు, కృత్రిమ గర్భధారణ, చూలి తనిఖీలు చేశారు. కోళ్లు, మేకలకు అవసరమైన మందులను అందజేశారు. తారువ టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు అల్లు సరోజ శ్రీనివాసు రావు, గ్రామ సర్పంచ్ జి వరహాలమ్మ, రెడ్డి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్