కె. జె పురం, లోవ పొన్నవోలులో పశు ఆరోగ్య శిబిరాలు

మాడుగుల మండలం కె. జె పురం, లోవ పొన్నవోలు గ్రామాలలో గురువారం పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు పర్యవేక్షించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాలలో 16 పశువులకు సాధారణ చికిత్సలు, 15 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు, 14 పశువులకు చూడి పరీక్షలు, 83 పశువులకు, 48 పెయ్యలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జామి వెంకటరమణ, ఎంపిటిసి భేసెట్టి శ్రీ లక్ష్మి, పాల ప్రెసిడెంట్ ఎల్లపు శ్రీను హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్