ఈనెల 11 నుండి 25 వరకు నిర్వహిస్తున్న ఉచిత లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమo లో భాగంగా చీడికాడ మండలం కండివరం గ్రామంలో జరుగుతున్న టీకా కార్యక్రమాన్ని మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు మండలంలో 1240 పశువులకు లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు డా. మణిలక్ష్మణ్ తెలియ జేశారు.