చిన్నారులు ఆనందంగా హోలీ పండుగ

మాడుగుల మూడు రోజుల జంక్షన్లో గల బాల వినాయక మందిరం వద్ద మంగళవారం చిన్నారులు హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అనురాగానికి, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచిన ఈ పండుగ సందర్భంగా, పిల్లలు రకరకాల రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ సంతోషంగా గడిపారు. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో చిన్నారులు హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్