అచ్యుతాపురం మండలంలోని ఉప్పరంలో ఉపాధి హామీ పనులు నిలిచిపోవడంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము తెలిపారు. సోమవారం అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకం కూలీలు నిరసన చేపట్టారు. ఉపాధి లేక కష్టాల్లో ఉన్న కూలీలకు వెంటనే పనులు ప్రారంభించి ఉపాధి కల్పించాలని, లేదంటే భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.