న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సోమవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను చర్చలకు పిలవకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ వమాడుగుల మండల నాయకులు ఇరట నరసింహమూర్తి పేర్కొన్నారు. మంగళవారం మాడుగులలో అంగన్వాడీలతో కలిసి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలందరికీ కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు.