మాడుగుల; ఢీగోట్టివాడలో నిత్యవసర వస్తువులు పంపిణీ

మాడుగుల మండలం డి గోటివాడ గ్రామంలో తుఫాను బాధితులైన 28 కుటుంబాలకు, 55 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. త్వరలో ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కే రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలరాజు, స్థానిక సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్