అనకాపల్లి జిల్లా మాడుగుల బీసీ హాస్టల్‌లో శుక్రవారం ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. హాస్టల్‌లో కిచిడీ తిన్న ఏడుగురు విద్యార్థులు పాఠశాల అసెంబ్లీ సమయంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా, విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సరఫరా చేసిన ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.