మాడుగుల: ఉచిత టీకాల కార్యక్రమం

మాడుగుల మండలంలో అన్ని గ్రామాలలో ఉచిత లంపీ స్కిన్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మాడుగులలో జరుగుతున్న టీకా కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 195 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్