పాయకరావుపేటలో అక్రమ సారా విక్రేతలు అరెస్ట్

పాయకరావుపేటలో అక్రమ సారా విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సాకేటి శంకర్రావు, ఎస్సై ఆలీ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో కోశెట్టి దుర్గాప్రసాద్ (1 లీటరు), తోటా వెంకటేశ్వర్లు, జక్కల వెంకటరమణ (చెరో 2 లీటర్లు) సారాను విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు ఎలమంచిలి సబ్‌జైలుకు రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్