కే కోటపాడు; గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

చే కోటపాడు మండలం ఏ కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆనందపురంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. ఆనందపురంలో ఒక వాటర్ ప్లాంట్ వెనుక గల వేచలపు చెరువు బంధ ఒడ్డున ఈ మృతదేహాన్ని గురువారం వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్న వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. సుమారు 50 ఏళ్ల గల ఈ వ్యక్తి బోడిగుండుతో ఉన్నాడన్నారు. ఈ మేరకు ఏ కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్