మాడుగుల;బాలికల హక్కుల చట్టాలపై అవగాహన

మాడుగుల జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. లావణ్య మాట్లాడుతూ, బాలికల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహనతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంరక్షణకు పోక్సో, బాల్య వివాహాల నియంత్రణ, బాలల అక్రమ రవాణా నియంత్రణ వంటి చట్టాలు చేశాయని ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్