మాడుగుల: భీష్మ ఏకాదశి ఉత్సవాలు, నామ సంకీర్తనతో మహిళల భాగస్వామ్యం

గురువారం మాడుగుల మండలంలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఎం కోటపాడు రామాలయంలో సమరసితా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకాహం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని నామ సంకీర్తన చేశారు. ఫౌండేషన్ జిల్లా ప్రచార కార్యదర్శి పి సన్యాసిటీతో పాటు పలువురు పాల్గొన్నారు. మాడుగులలోని శ్రీ వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి, పార్థసారథి స్వామి, కేజీ పురం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్