మాడుగుల: జులై 20న మోదకొండమ్మ పండగ

మాడుగుల మండలం కేజే పురం ఆరాధ్య దేవత మోదకొండమ్మ అమ్మ వారి పండుగ జులై 20న నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ఆదివారం తెలిపింది. ఈ మేరకు సోమవారం నుంచి గ్రామంలో ఘటాల ఊరేగింపు ప్రారంభం కానుందనీ, ఈ వారం రోజులు రామాలయం ఆవరణలో గ్రామస్తులు వాలకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉత్సవాలు జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

సంబంధిత పోస్ట్