ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, మాడుగుల ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ వారి తీర్థ మహోత్సవం మార్చి 10వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల అప్పలరాజు శనివారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పుర ప్రజలు, భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. తీర్థానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు పి అప్పలరాజు, సభ్యులు దంగేటి సూర్యారావు, ఎస్ శ్రీనివాసరావు, బీహెచ్ పైడయ్య నాయుడు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.