మాడుగుల బస్టాండ్ ఆవరణలో ఉన్న శ్రీ దుర్గా దేవి ఆలయ అభివృద్ధికి, మండప నిర్మాణానికి మండల పరిషత్ సభ్యురాలు షేక్ ఉమేష్ తన గ్రామం నుంచి లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఈ చెక్కును గురువారం సాయంత్రం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శి ఏఎన్వి ప్రసాదరావు, సభ్యులు ఎస్ వెంకటరాజు, వైసిపి నాయకులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, హేమంత్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఆమెను అభినందించారు.