కార్తిక మాసం రెండోవారం సందర్భంగా, సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మాడుగులలోని ఉబ్బలింగస్వామి, స్వర్గ లింగేశ్వర స్వామి, శ్రీ కృష్ణ గోపాలకృష్ణ స్వామి, భీమలింగేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పాండవులు గిరిపై గల పార్థసారథి స్వామి వారిని కూడా భక్తులు దర్శించుకున్నారు. జంపెన శివాలయంలో ఎంపీపీ టి.వి. రాజారాంతో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు.