మాడుగుల అర్బన్ కాలనీలో నెలకొన్న విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం విద్యుత్తు ఏ డి ఈ, ఏఈ లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కాలనీలో విద్యుత్ లో వోల్టేజ్, హై ఓల్టేజ్ సమస్య ఎక్కువగా ఉందని , ఇటీవల నాలుగైదు నెలల నుంచి లోఓల్టేజ్ ఎక్కువగా ఉందని చెప్పారు. రాత్రి సమయంలో అయితే మరిన్ని ఇబ్బందులు పడుతున్నామన్నారు.
.