మాడుగుల;వైద్యానికి వాసవి చారిటీ చేయూత

రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు యువకులకు వాసవి చారిటీ గ్రూప్ రూ. 66,000 ఆర్థిక సహాయం అందించింది. ఆదివారం, వాసవి చారిటీ గ్రూప్ సభ్యులు ప్రమాదానికి గురైన కొల్లా మనోజ్ కుమార్, విశ్వనాధ గుప్తా అనే యువకుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా చారిటీ గ్రూప్ అధ్యక్షులు ఆలవెల్లి శేఖర్ మాట్లాడుతూ, జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన యువకులు ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డిమ్స్ రాజు, కోశాధికారి సముద్రాల నాగరాజు, బి. వి. పి. ఎస్. రామాయ్య, గోనుగుంట్ల నారాయణరావు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్