మాడుగుల మండలం సత్యవరంలో వీధి రోడ్లు బురదతో కప్పిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా పడుతున్న వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోతోంది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నవారికి ప్రయాణం కష్టంగా మారింది. దోమలు పెరిగి నివాసితులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.