మాడుగుల రాజవీధిలో గల మామిడి లక్ష్మి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లోవారు వేరే ఊరు వెళ్లడంతో పసిగట్టిన దొంగలు ఆదివారం రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాలో గల 40 తులాల బంగారం, కేజిన్నర వెండి, సుమారు రెండు లక్షల నగదు చోరీ చేశారని లక్ష్మి తెలిపారు. పక్కింటి వారు తమ సమాచారంతో సోమవారం ఉదయం వచ్చి చూసుకున్నామని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎస్ఐ నారాయణరావు సంఘటన స్థలం చేరుకొని పరిశీలన జరిపారు.