మాడుగుల నియోజకవర్గం కె. కోటపాడు మండలం, ఆనందపురం గ్రామంలో శుక్రవారం సుపరిపాలన తొలి అడుగు, డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు, గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు