సత్యవరంలో రేపు రాజముద్రత కూడిన పాసు పుస్తకాలు పంపిణీ

మాడుగుల మండలంలోని సత్యవరం గ్రామంలో శుక్రవారం రాజమద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు 638 మంది రైతులకు పంపిణీ చేయనున్నట్లు స్థానిక తహసీల్దార్ కే రమాదేవి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా ఈ పుస్తకాలను సత్యవరం కమ్యూనిటీ హాల్ వద్ద అందించనున్నారు. రైతులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్