ఈనెల రెండు నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

మాడుగుల మండలంలో రిసర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు రాజముద్రత కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు తహసీల్దార్ కే రమాదేవి బుధవారం తెలిపారు. ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు వివిధ సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఈనెల 2న పొంగలపాకలో పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభిస్తారు. మొదటి రోజు పొంగలిపాక, పి శివరాంపురం గ్రామాల్లో 720, మధ్యాహ్నం వంటల పాలెం లో 675 మంది రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్