మాడుగుల సహకార సంఘంలో సభ్యత్వం కలిగి, బ్యాంక్ రుణం పొంది మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు మంగళవారం సంఘం తరపున ఆర్థిక సహాయం అందజేయబడింది. సంఘ అధ్యక్షుడు కొట్నాల త్రినాదరావు, సీఈఓ బోర ఈశ్వర రావులు బాధం దేవి ప్రసాద్, గల్లాకన్నబాబు కుటుంబాలకు ఒక్కొక్కరికి 30,000 రూపాయలు, సియ్యాద్రి మహలక్ష్మి కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున నగదు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు కర్రి లక్ష్మి రావు, మాటూరి మంగమ్మ, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.