చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ దబ్బగరువు జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్నెర్ల గ్రామానికి చెందిన కించే చినలక్ష్మి పడాల్, పెద్దగెడ్డ వంగసార గ్రామానికి చెందిన సిందేరి కమల, గొయ్యిగుంట గ్రామానికి చెందిన పాంగి సుందర్రావులతో పాటు ఇతర ద్విచక్ర వాహనదారులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.