అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, దేవరపల్లి పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని శుభ్రత, నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల పెండింగ్ స్థితి తదితర అంశాలను సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు పరిశీలించి వాటి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పాత కేసులను వేగంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.