అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు జంపెన గ్రామానికి చెందిన దాసరి వరుణ్, పెచ్చేటి సాయి కిరణ్‌గా గుర్తించారు. గాదిరాయి పండగకు వెళ్లి తిరిగి వస్తుండగా, వీరి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.