నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ నర్సీపట్నంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీ ఎమ్ ఆర్ డి ఏ ద్వారా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకు సహకరించిన విఎంఆర్ డీజే చైర్మన్ ప్రణగోపాల్కు, మంత్రి నారాయణ కు ధన్యవాదాలు తెలిపారు.