నర్సీపట్నం డివిజన్ మాకవరపాలెం మండలం జి. కోడూరులో రాళ్ళ క్వారీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాధితులు మాకవరపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దళిత కుటుంబాలకు చెందిన సర్వే నెంబర్ 332లో ఉన్న సాగుభూముల సమీపంలో అనుమతించిన రాళ్ల క్వారీని వెంటనే రద్దు చేయాలని బహుజన ఐక్యవేదిక నాయకులు బొట్టా నాగరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సాగుభూములకు సమీపంలో రాళ్లను పేల్చడం వల్ల రైతులు నష్టపోతారన్నారు.