గొలుగొండ: పేరెంట్స్ - టీచర్స్ మీట్‌లో పాల్గొన్న స్పీకర్

గొలుగొండ మండలం ఏఎల్‌పురం హైస్కూల్లో గురువారం జరిగిన పేరెంట్స్ - టీచర్స్ మీట్‌లో స్పీకర్ అయ్యన్న పాల్గొన్నారు. తల్లిదండ్రులకు సెల్‌ఫోన్ వాడకం రాకపోయినా పిల్లలు మాత్రం వినియోగిస్తున్నారని తెలిపారు. పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వొద్దని వారు చదువుకునే సమయంలో టీవీలు చూడకుండా ఉండాలని సూచించారు. నెలకోసారి పాఠశాల కమిటీ సమావేశం జరిపి సమస్యలపై చర్చించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్