గొలుగొండ మండలం ఏటి గైరంపేటకు చెందిన యువ రైతు శివగణేశ్‌ను నర్సీపట్నం మార్కెట్ యార్డులో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలో స్పీకర్ అయ్యన్న ప్రత్యేకంగా అభినందించారు. 25 ఏళ్ల వయసులో 5 ఎకరాల్లో అరటి, పామాయిల్ తోటలు సాగు చేస్తూ నియోజకవర్గంలో నెంబర్ వన్‌గా నిలిచాడని పేర్కొన్నారు. ఇంత చిన్న వయసులో వ్యవసాయం చేస్తుంటే మనం నేర్చుకోవాలా లేక సిగ్గుపడాలా అని వ్యాఖ్యానించారు.