మాకవారపాలెం మండలం జి. కోడూరు ప్రాంతంలో నల్లరాయి క్వారీ లీజు అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు, దళితులు నర్సీపట్నంలో చేపట్టిన నిరసన కార్యక్రమం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత రుత్తల ఎర్రాపాత్రుడు గురువారం పాల్గొని దళిత రైతులకు మద్దతు తెలిపారు. మండలంలోని జి. కోడూరు ప్రాంతంలో నల్లరాయి క్వారీ ప్రారంభిస్తే తమ పంట భూములకు క్వారీ వలన తీవ్ర జరుగుతుందన్నారు.