రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం నర్సీపట్నంలో నియోజకవర్గ పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు రూ. 11 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బాధితులకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.