మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, నేడు డ్వాక్రా మహిళలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం నర్సీపట్నం టీటీడీ కళ్యాణ మండపంలో మెప్మా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా స్థాయి 'ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ ట్రైనింగ్' కార్యక్రమం నిర్వహించారు. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు చెందిన సుమారు 500 మంది ఎస్. హెచ్. జి సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు శిక్షణకు రావడం శుభపరిణామమన్నారు.