నర్సీపట్నంలో గో హాస్పిటల్స్, అమెరికా డాక్టర్ ఆశ్రిత కంచర్లపల్లి బృందం సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ శిబిరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో నేత్ర పరీక్షలతో పాటు వివిధ రకాల రోగాలకు సంబంధించి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.