నర్సీపట్నం మున్సిపాలిటీలోని 26వ వార్డులో సోమవారం తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ పండుగలా జరిగింది. స్థానిక కౌన్సిలర్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ఉదయం 6 గంటలకే ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పింఛన్ నగదును అందజేశారు. వారి యోగక్షేమాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ అయ్యన్న సహకారంతో నర్సీపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పద్మావతి పేర్కొన్నారు.