ప్రతి గ్రామానికి రహదారి రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యమని, రహదారి వనరులపై ప్రత్యేక దృష్టి సారించానని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలోని నర్సీపట్నం, గోలుగొండ, నాతవరం, మాకవారిపాలెం మండలాల్లో 655 కోట్ల తో నాబార్డ్ నిధులతో 20 కిలోమీటర్ల మేర మొత్తం తొమ్మిది రహదారి నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని స్పీకర్ వెల్లడించారు.