నర్సీపట్నం: ఆర్టీఓగా ఎంపికైన సంతోషిని అభినందించిన స్పీకర్

విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (RTO)గా ఎంపికైన లగుడు సంతోషి, శనివారం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. నర్శీపట్నం మండలం సుబ్బారాయుడుపాలెం గ్రామానికి చెందిన సంతోషి, రెండు రోజుల వ్యవధిలోనే గ్రూప్-2 (ASO), గ్రూప్-1 (RTO) ఫలితాల్లో విజయం సాధించి ద్వంద్వ విజేతగా నిలిచారు. సామాన్య నేపథ్యం నుండి వచ్చి, పట్టుదలతో శ్రమించి అత్యున్నత గెజిటెడ్ హోదాను సాధించడం గర్వకారణమని స్పీకర్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్