ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం నాతవరం మండలం డి. యర్రవరం గ్రామంలో రూ. 1.97 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించి, వృద్ధులు, వితంతువులకు ఇంటింటికీ వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ స్వయంగా పింఛన్లను అందజేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన కె. జి. బి. వి టైప్-4 బాలికల వసతి గృహాన్ని, గ్రంథాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు.