నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మితమైన అదనపు అంతస్తులపై తీవ్ర చర్చ జరిగింది. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా పై అంతస్తులు నిర్మించిన వారిపై తక్షణమే నోటీసులు జారీ చేయాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అధికారులను డిమాండ్ చేశారు. అయితే ఇలాంటి నిర్మాణాలు గత ప్రభుత్వం హయాంలోనే ప్రారంభమైందనీ మరి కొందరు సభ్యులు మండిపడ్డారు.