నర్సీపట్నం పురపాలక సంఘంలో శుక్రవారం మెప్మా ఆధ్వర్యంలో 'సఖీ సురక్ష' ఆరోగ్య శిబిరం విజయవంతంగా జరిగింది. నర్సీపట్నం పాత మున్సిపల్ కార్యాలయం, పెద్దబొడ్డేపల్లి మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించిన ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 685 మంది ఎస్ హెచ్ జి సభ్యులకు షుగర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వివిధ రకాల రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.