సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకు స్పీకర్ అయ్యన్న, దాతల ఆర్థిక సాయo

హర్యానాలో ఈ నెల 6వ తేదీ నుండి జరగనున్న జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ జట్టును శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం అభినందించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఎంపికైన 36 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడాకారుల ఖర్చుల నిమిత్తం కేడి పేట హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం రూ. 35,000, అనకాపల్లికి చెందిన ప్రముఖ విద్యాసంస్థల అధినేత దాడి రత్నాకర్ రూ. 50,000 ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని స్పీకర్ అయ్యన్న క్రీడాకారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్