నాతవరం మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం, గునుపూడి గ్రామంలో శుక్రవారం పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరై స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇతర రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో పెన్షన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్