విశాఖను ఐటీలో హైదరాబాద్‌ను మించి తీసుకెళ్తాం: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నాన్ని దేశ ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గూగుల్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ‘ఏఐ శక్తి కాన్‌క్లేవ్’లో పాల్గొన్న ఆయన, రాబోయే పదేళ్లలో విశాఖను ఐటీ రంగంలో హైదరాబాద్‌ను మించిన స్థాయికి తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ అభివృద్ధికి సమగ్ర ఎకో సిస్టమ్‌ను నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్