అడ్డతీగల: కుప్పకూలిన పాఠశాల భవనం

అల్లూరి జిల్లా చినమునకనగడ్డ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిల భవనం ఇటీవల కురిసిన వర్షాల కారణంగా శుక్రవారం అర్థరాత్రి కూలిపోయింది. పదేళ్లుగా శిథిలంగా ఉండటంతో పక్కనే ఉన్న మరో గదిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 26 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఎంఈవో శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని, త్వరలో కొత్త భవనం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్