విశాఖపట్నంలో మంగళవారం, ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ లైసెన్స్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, తాడేపల్లి ప్రాంతాలలో సోదాలు నిర్వహించగా, సుమారు 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. చిన్నప్పన్నను కోర్టులో హాజరుపరచగా, వచ్చేనెల 8వ తేదీ వరకు రిమాండ్ విధించారు.