భీమిలి: పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

భీమిలిలోని పెద్ద నాగమయ్యపాలెంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 9వ తేదీ వరకు భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 13 వేలకుపైగా పాస్ పుస్తకాలు అందజేస్తామని, రీ సర్వే పూర్తి చేసి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. అదే గ్రామంలో రూ. 63. 15 లక్షల దివీస్ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన పోలమాంబ, భూలోకమ్మ, రమణమ్మ, దుర్గాలమ్మ ఆలయాలను ఆయన ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్