ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వీరిద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఏయూ వంద ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, క్రీడలు మరియు విద్యారంగంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేశానికి గర్వకారణమైన సచిన్ రాకతో వర్సిటీ ప్రాంగణంలో సందడి నెలకొంది. సీఎం చంద్రబాబుతో సచిన్ సాగించిన ఈ మాటామంతీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.